Untitled Document
Lankuru Village
లంకూరు (సీతానగరం)
Lankuru
Sivaji Matta
గ్రామం :
లంకూరు (సీతానగరం)


View Larger Map
మండలం :
సీతానగరం
చుట్టుప్రక్కల గ్రామాలు :
తూర్పున రాజుపాలెం,పడమరన గోదావరి నది,ఉత్తరాన చినకొండేపూడి,దక్షిణాన వెలమపేటలు కలవు
ప్రధాన పంటలు :
కొబ్బరి,వరి
గ్రామ జనాభా :
5500
అక్షరాశ్యతా శాతం :
55 %
గ్రామ విస్తీర్ణం :
పిన్ కోడ్ :
533234

     హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శివాజీ మట్టా మా ఊరి గురించి చెప్పాలంటే అందమైన ప్రకృతి నడుమ పచ్చటి పంట పొలాలతో జల జల పారే గొదారమ్మ ఒడ్డున ఉన్న అందమైన గ్రామం మా లంకూరు (వెంకట కృష్టాపురం).మా ఊరు తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరానికి ఆనుకుని ఉంది.
     మా ఊరి ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం.ఇక్కడి ప్రజలు వరి,మొక్కజొన్న,అరటి,పొగాకు పంటలను ఎక్కువగా పండిస్తారు.మాఊరితో పాటు 6 గ్రామాలు కలసి ఉండటం విశేషం.మా ఊరి మరో ప్రత్యేకత ఏమిటంటే స్వాతత్ర్యోద్యమ సమయయంలో గాంధీజీ పూరించిన సహాయనిరాకరణోద్యమ శంఖారావానికి ఉత్తేజితులు అయిన ఇక్కడి ప్రజలు ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొని తమ దేశ భక్తిని చాటి చెప్పారు.
     పవిత్ర గోదావరీ తీరాన మా ఊరికి చెందిన డాక్టర్ బ్రహ్మ జ్యోస్యుల సుబ్రమణ్యం గారు 1924 నవంబర్ 9 వ తేదీన గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమాన్ని నెలకొల్పారు.ఈ ఆశ్రమం ఎన్నో ఉద్యమాలకు కేంద్ర బిందువుగా నిలిచి దక్షిణ భారతదేశపు సబర్మతిగా ఖ్యాతిని ఆర్జించింది.1929,1932 సంవత్సరాలలో మహాత్మాగాంధీ తన ఉద్యమాల్లో భాగంగా ఇక్కడ సేద తీరి ఈ ఆశ్రమాన్ని పావనం చేసారు.దీనికి అనుభందంగా కస్తూర్బా ఆశ్రమం నడపబడుతుంది.ఇక్కడ స్త్రీలు తమ తమ వృత్తులు నిర్వహించి ఉపాధిని పొందుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.


     మా ఊరిలో విష్టాలయం,శివాలయం,దుర్గమ్మ,ఆంజనేయస్వామి అలయాలు కలవు.మా ఊరికి దగ్గరలో ఉన్న పెద్ద పట్టణం రాజమండ్రి (28).

Untitled Document
         
Untitled Document
 
© 2013 andhrabulletin.com